జయలలిత మాజీ సఖి శశికళ భర్త నటరాజన్ ఆరెస్టు

శశికళ, ఆమె బంధువులు పార్టీలో, ప్రభుత్వంలో అదుపు లేకుండా జోక్యం చేసుకుంటున్నారనే ఉద్దేశంతో వారిని ఆమె బహిష్కరించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ శనివారంనాడే కర్ణాటక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో జయలలితతో పాటు శశికళ కూడా నిందితురాలు. ఈ కేసుతో జయలలితకు సంబంధం లేదని శశికళ కోర్టుకు చెప్పారు.
శశి ఎంటర్‌ప్రైజెస్ ఖాతాలను తాను ఒక్కదాన్నే నిర్వహించానని, ఈ కంపెనీలో జయలలిత ప్రచ్ఛన్న భాగస్వామి మాత్రమేనని ఆమె చెప్పారు. 1991 - 1996 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత 66 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారనే ఆరోపణపై ఈ కేసు నడుస్తోంది. కోర్టులో వాంగ్మూలం ఇచ్చే సమయంలో శశికళ ఒక్కసారిగా ఏడ్చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications