హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై అసెంబ్లీలోనూ బాబుది అదే మాట

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై తెలుగదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాత మాటలే మళ్లీ వల్లించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం శాసనసభలో ఆయన ప్రసంగించారు. సుదీర్ఘంగా సాగిన ప్రసంగంలో పలు విషయాలతో పాటు తెలంగాణ అంశాన్ని కూడా ప్రస్తావించారు. తెలంగాణపై తమ వైఖరిని ఇది వరకే చెప్పామని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, తెలంగాణపై నిర్ణయం తీసుకుని రాష్ట్రంలోని అనిశ్చితికి తెర దించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. తమను అడ్డం పెట్టుకుని కాంగ్రెసు రాజకీయాలు చేస్తోందని, తమ పార్టీని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోందని, తమ పార్టీని ఎవరూ దెబ్బ తీయలేరని ఆయన అన్నారు. ఉద్యమాల సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులను మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పొరుగు రాష్ట్రం మంత్రికి ఆనాటి ముఖ్యమంత్రి అక్రమంగా గనులు లీజుకు ఇస్తే, ఇప్పటి ముఖ్యమంత్రి పోలవరం టెండర్ల ఖరారులో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. టెండర్లు రద్దు చేసినంత మాత్రాన సరిపోదని ఆయన చెప్పారు. దొంగలు పట్టుబడి, దొంగ సొత్తు స్వాధీనం చేసుకున్నంత మాత్రాన కేసు మాఫీ కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతికి వోక్స్ వ్యాగన్ బలైందని ఆయన అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు.

English summary
TDP president N Chandrababu Naidu reiterated his words on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X