మోపిదేవి వెంకటరమణ జేబులో రాజీనామా లేఖ

మోపిదేవి వెంకటరమణ ఆగ్రహించినా ముఖ్యమంత్రిగా నింపాదిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. కూల్‌గా ఉండు, ఏమీ కాదులే అని సర్దిచెప్పినట్లు సమాచారం. శాసనసభలో ఆరోపణలపై మాట్లాడాలని, తాను కూడా మాట్లాడుతానని, ఏమీ కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మోపిదేవితో అన్నట్లు సమాచారం.
తాను తీవ్ర మనస్తాపానికి గురవుతున్నానని, విచారణ త్వరగా జరిపించి దీనికి పుల్‌స్టాఫ్ పెట్టాలని సీఎంను కోరానని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. దీనిపై ఏ విచారణకైనా సిద్ధమేనని, ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తానని, లేఖ నా జేబులోనే ఉందని, బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని అయినందునే తన పేరు బయటకు వస్తోందన్న ప్రచారం కూడా జరుగుతోందని ఆయన అన్నారు. తనకు సంబంధం లేదని చెప్పినా ఏసీబీ వివరణ కోరడం లేదని, మానసికంగా ఇబ్బంది పెడుతోందని, తననకు డబ్బులిచ్చారన్న ఇద్దరు వ్యక్తులపై విచారణ జరిపిస్తానని సీఎం హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications