తెలంగాణ సున్నితమైనది, అందుకే చేర్చలేదు: సిఎం

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు రైతు ప్రతినిధిగా చెప్పుకోలేదన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి తనను తాను సిఈవోగా మాత్రమే చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రైతులకు నష్టం జరిగింది తప్ప లాభం జరగలేదు. ఆ నష్టాన్ని ఇన్ని సంవత్సరాలైనా కూర్చడం సాధ్యం కావడం లేదని కిరణ్ మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌కు బాబు ఎన్నేళ్ల తర్వాత మద్దతిస్తున్నారని అడిగారు. ఇన్నేళ్ల తర్వాత ఆయనకు ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రైతులు చాలా నష్టపోయారన్నారు. ప్రతిపక్షం రైతులపై కపట ప్రేమ ప్రదర్శిస్తూ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications