నారాయణ పందులదొడ్డి వ్యాఖ్యపై స్పీకర్ సీరియస్

Narayana
హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ 'అసెంబ్లీ పందుల దొడ్డి' అని చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ సీరియస్‌గా స్పందించారు. సభా మర్యాదను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావును ఉద్దేశించి అన్నారు. నారాయణకు నోటీసులు జారీ చేస్తామని, ఆ తర్వాత తప్పకుండా 'పనిష్మెంట్' ఉంటుందని హెచ్చరించారు. మంత్రులు ధర్మాన, ఆనం రామనారాయణ రెడ్డి, కూనంనేని మధ్య జరుగుతున్న సంవాదం నారాయణపై చర్యలకు ప్రకటన చేసే దిశగా ఆకస్మిక మలుపు తిరిగింది.

సభలో లేని తమ నాయకుడు నారాయణ గురించి మంత్రి ధర్మాన మాట్లాడటం సరికాదని, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, సభలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని, సభా మర్యాదలు పాటించాలని సిపిఐ సభ్యుడు కూనంనేని అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే అంశంపై మాత్రమే మాట్లాడాలని, బయట ఉన్న వాళ్ళ గురించి చర్చించవద్దని స్పీకర్ అన్నారు. ప్రతి అంశాన్ని భూతద్దంలో చూడటం మంచిది కాదని, ధర్మాన యువకులకు వచ్చేంత ఆవేశంతో మాట్లాడారని, తప్పు చేసిన వాళ్లే అలా ఆవేశపడుతుంటారని, సభలో లేని నారాయణ గురించి మాట్లాడడం పార్లమెంటరీ పద్ధతి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కూనంనేని అన్నారు. నారాయణ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+