వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నో కామెంట్!: చంద్రబాబు, హరికృష్ణ సఖ్యతపై దగ్గుపాటి

జాతీయస్థాయిలో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రత్యర్థిపక్షం భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో కన్పిస్తున్నా పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌కు పోటీ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కాగా, రాష్ట్ర రాజకీయాలపై స్పందించేందుకు దగ్గుబాటి ఆసక్తి చూపలేదు. రాష్ట్ర రాజకీయాలపై తాను వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌లు చంద్రబాబుతో సఖ్యతతో ఉంటున్నారా అనే విషయంపైనా ఆయన స్పందించలేదు. ఎవరు నమ్మినా నమ్మకున్నా విచిత్రంగా అన్పించినా ఇది నిజమని అన్నారు. వివిధ దేశాల్లోని పాలనా విధానంపై ఒక పుస్తకాన్ని రాస్తున్నానని ఈ సందర్భంగా దగ్గుబాటి తెలిపారు