తెలంగాణ ప్రాంతీయ బోర్డు వైపే కాంగ్రెసు మొగ్గు

తెలంగాణకు ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేస్తూ ఏప్రిల్‌లోగా ప్రకటన చేయాలనే ఆలోచన కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక మండలి స్వరూప స్వభావాలపై ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ హిల్ కౌన్సిల్ తరహా పరిష్కార మార్గాన్నే తెలంగాణకు వర్తింపజేయాలనే ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ, సీమాంధ్ర నాయకులతో పలు మార్లు చర్చలు జరిపిన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సోనియాకు ఓ నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగ, చట్టబద్ద హక్కులతో తెలంగాణకు ప్రత్యేక మండలి ప్రకటిస్తూ భారీ ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడమే మంచిదని ఆయన అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications