గద్దెనెక్కి వైయస్‌పై కుట్ర, బాబుతో కుమ్మక్కు: జగన్

వైయస్ రాజశేఖర రెడ్డిపై బురజ చల్లడానికి కాంగ్రెసు నాయకులు నైతిక విలువలను పక్కన పెట్టి చంద్రబాబుతో కుమ్మక్కయి రాజకీయాలు చేస్తున్నారని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మరణించిన వైయస్ రాజశేఖర రెడ్డికి ఒక న్యాయం, బతికి ఉన్న చంద్రబాబుకు మరో న్యాయం అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెసు ప్రభుత్వానికి ప్రజలు, ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆయన అన్నారు. వ్యవసాయం చేయడం కన్నా ఉరేసుకోవడం మేలని రైతన్న భావిస్తున్నాడని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications