కాలువలో బస్సు, నాలుగు మృతదేహాలు వెలికితీత

East Godavari District
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం సాయంత్రం విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సు కాలువలో పడిపోయింది. దీంతో ఇద్దరు పిల్లలు మరణించినట్లు అనుమానిస్తున్నారు. అయితే నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మరో ఆరుగురు గల్లంతయినట్లు వార్తలు వస్తున్నాయి. 12 మంది పిల్లలను రక్షించినట్లు సమాచారం. బయటపడిన పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అమలాపురంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం మండలం గంటిపెద్దపూడి గ్రామం వద్ద చోటు చేసుకుంది.

కాలువలో పడిపోయిన బస్సు పి. గన్నవరంలోని సాయి తేజ స్కూల్ బస్సు అని తెలుస్తోంది. ఐదో తరగతి వరకే అక్కడ స్కూలు నడుస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న పిల్లలు చిన్నవారు కావడంతో ఆందోళన పెరుగుతోంది. కాలువ పది అడుగుల లోతు ఉంటుంది. కాలువ ప్రవహిస్తుండడంతో పిల్లలు కొట్టుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుల్లో బిందు మాధవి, అడ్డాల సత్యనారాయణ, అడ్డాల రోహిత ఉన్నట్లు గుర్తించారు.

సహాయక చర్యల నిమిత్తం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. స్వయంగా వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆయన జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. లారీ అడ్డం రావడంతో బస్సు డ్రైవర్ తప్పించబోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నంలోనే బస్సు కాలువలో పడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+