కన్నేస్తే ఖబర్దార్: ముఖేష్‌కు అంజన్ కుమార్ హెచ్చరిక

గోషామహల్‌లో ముఖేశ్ గౌడ్ దేవాదాయ శాఖ భూములు ఆక్రమించారని ఆరోపించారు. ముఖేశ్, ఆయన కుమారుడు కలిసి ప్రజలను దోచుకుతింటున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తన మామ దేవేందర్‌గౌడ్‌ను అడ్డం పెట్టుకొని ముఖేశ్ అక్రమంగా రూ.కోట్ల ఆస్తిని కూడబెట్టాడని అంజన్ కుమార్ ఆరోపించారు. మంత్రి ముఖేశ్ సికింద్రాబాద్ ఎంపి సీటు గురించి ఆలోచించడం మానుకుంటే మంచిదని అంజన్ హితవు పలికారు. వైయస్‌కు నేను విన్నవించడం వల్లనే ముఖేష్‌కు మంత్రి పదవి దక్కిందని అది అతను గుర్తుంచుకోవాలన్నారు. మంత్రి వైఖరిపై తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాగా 2014 ఎన్నికల్లో తాను సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తానని అంజన్ ముషీరాబాద్ నుండి పోటీ చేస్తారని మంత్రి ముఖేష్ గౌడ్ మంగళవారం ఉదయం చెప్పిన విషయం తెలిసిందే. ఈయన వ్యాఖ్యలపై అంజన్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications