వైయస్‌ఆర్‌పై కక్ష మాపై తీర్చుకోండి: సభలో విజయమ్మ

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏ పన్నులు, ధరలు పెంచలేదన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ పన్నులు పెంచకుండానే ఎలా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టగలుగుతున్నారని వైయస్సార్‌ను అప్పుడు అడిగారన్నారు. వ్యాట్‌ను ఎందుకు పెంచవలసి వచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశారు. వైయస్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆదాయం ఉన్నప్పటికీ ఇప్పటి ప్రభుత్వం దివంగత వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఎందుకు అమలు పరచడం లేదని, ధరలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. కరెంట్ కోతల వల్ల పరిశ్రమలు నష్ట పోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం పన్నులతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందన్నారు.
వైయస్ కాలంలో పన్నులేవీ పెరగలేదని పెరిగిందల్లా సంక్షేమమే అన్నారు. ఉచిత విద్యుత్‌ను ఎందుకు నీరుగారుస్తోందన్నారు. కాంగ్రెసు పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చిన విధంగా పేదవారికి బియ్యం కోటా పెంచలేదన్నారు. సంక్షేమ పథకాలకు కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. పేదలు కొనుక్కోలేని విధంగా నిత్యావసర ధరలు పెరిగాయన్నారు. బడ్జెట్‌లో వరికి బోనస్ ప్రస్తావన లేదన్నారు. వ్యవసాయాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ తొమ్మిది గంటలు ఎందుకు ఇవ్వలేక పోతున్నారన్నారు.












Click it and Unblock the Notifications