ప్రియురాలి కూతురిని కాల్చేసిన కిరాతక ప్రియుడు

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదహరాబాదు శివారులో మంగళవారం దారుణ సంఘటన చోటు చేసుకుంది. తన ప్రియురాలి కూతురిని ఓ ప్రియుడు దారుణంగా కాల్చి చంపిన సంఘటన చోటు చేసుకుంది. గాజుల రామారాం గ్రామంలో తన ప్రియురాలిపై పగ తీర్చుకోవడానికి ఆమె ఏడేళ్ల కూతురిని కాల్చి చంపాడు. తన ప్రియురాలు సుజాత తనను మోసం చేస్తోందనే అనుమానంతో ముప్పయి ఏళ్ల విజయ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెబుతున్నారు.

ఓ ఖాళీ ఇంట్లోంచి పొగలు వస్తుండడానికి గాజులరామారాం సమీపంలోని మహదేవపురం వద్ద గల పెట్రోల్ బంక్ ఉద్యోగి గుర్తించాడు. అతని చెప్పడంతో కొంత మంది అక్కడికి పరుగెత్తారు. చాపలో చుట్టి ఉన్న బాలిక తగలబడిపోతుండడాన్ని వారు గమనించారు. అక్కడే ఉన్న విజయ్‌ను వాళ్లు పట్టుకున్నారు. వెంటనే మంటలను ఆర్పి బాలికను ఆస్పత్రికి తరలించినా కూడా ఫలితం లేకుండా పోయింది. గాంధీ ఆస్పత్రిలో ఆ బాలిక మరణించింది. విజయ్‌ను పోలీసులకు అప్పగించారు.

రెండేళ్ల క్రితం సుజాత భర్త చెన్నయ్య మరణించాడు. దీంతో తనకు దూరపు బంధువైన విజయ్‌తో ఆమెకు సాన్నిహిత్యం పెరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విజయ్‌తో ఆమెకు లైంగిక సంబంధం కూడా ఏర్పడింది. దినసరి కూలీ అయిన సుజాతతో విజయ్ తరుచుగా గడుపుతుండేవాడు. మంగళవారం ఉదయం సుజాత కూలీకి వెళ్లిన తర్వాత ఆమె కూతురు భవానీని తీసుకుని ఖాళీగా ఉన్న ఇంటికి తీసుకుని వచ్చాడు. చాపలో చుట్టుకుని తీసుకు వచ్చిన భవానీ ఒంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+