హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో మైనింగ్ కేసు: 2 రోజుల్లో బెంగళూరుకు గాలి షిఫ్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో పీకల్లోతు మునిగిపోయిన కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మరో మైనింగ్ కేసులో కూడా విచారణ ఎదుర్కోనున్నారు. బళ్లారికి చెందిన అసోసియేట్ మైనింగ్ కంపెనీ(ఎఎంసి)కి సంబంధించిన కేసులో గాలిని విచారించాలని బెంగళూరు కోర్టుకు సిబిఐ నివేదించింది. అందుకు కోర్టు అనుమతించడంతో చంచల్‌గూడ జైలులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకెళ్లేందుకు సిబిఐ సన్నాహాలు చేస్తోంది. గురు, శుక్రవారాల్లో ఆయన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి 2వ తేదిన ఎఎంసి కేసులో ఆయనను బెంగళూరు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు సిబిఐ డిఐజి హితేంద్ర మంగళవారం చంచల్‌గూడ జైలుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆయన వచ్చిన సమయంలో జైలు సూపరింటెండెంట్ లేకపోవడంతో జితేంద్ర వెనుదిరిగారు. డిఐజి స్థాయి అధికారి ప్రైవేటు వాహనంలో ఒక్కరే ఇలా జైలుకు రావడం, వెంటనే తిరిగి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. గాలి కేసు విషయంలోనే ఆయన వచ్చి ఉంటారా అనే సందేహాలు నెలకొన్నాయి.

కాగా ఓఎంసి అక్రమాల కేసులో గాలి ఆగస్టు 4వ తేదిన అరెస్టు అయ్యారు. ఆ తర్వాత నవంబర్‌లో ఎఎంసి పైన సిబిఐ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసింది. అందులో 21 పేర్లు పేర్కొంది. ఏఎంసి కేసులో బెంగళూరు కోర్టులో హాజరు పర్చేందుకు గాలిని రోడ్డు మార్గంలో గానీ విమానంలో గానీ తీసుకు వెళ్లే అవకాశముంది. మరోవైపు గాలి ఓఎంసి కేసులో హైదరాబాద్‌లో బెయిల్ పొందినా ఎఎంసి కేసులో కర్నాటకలో బెయిల్ పొందే వరకు ఆయన జైలులోనే ఉండవలసి ఉంటుంది. గాలి విషయమై ఇప్పటికే సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ అధికారులకు లేఖ రాశారట. సిబిఐ గాలిని బెంగళూరు కోర్టులో హాజరుపర్చి అనుమతితో తమ కస్టడీలోకి తీసుకొని ఎఎంసిపై ప్రశ్నించే అవకాశముంది.

English summary
Former Karnataka minister and mining scam accused Gali Janardhan Reddy will be produced in the Bengaluru CBI court on March 2 in connection with the Associated Mining Company (AMC) scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X