వైయస్ పేరు చెప్పి వైయస్ జగన్ దోపిడీ చేశారు: బొత్స

స్పీకర్ వేటు వేయడం వల్ల ఖాళీ అయిన 17 శాసనసభా స్థానాల్లో కూడా విజయం తమ పార్టీదేనని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో జయాపజయాలకు పార్టీ నాయకులు సమిష్టి బాధ్యత వహిస్తారని ఆయన చెప్పారు. వచ్చే 17 శాసనసభా స్థానాల ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్ అనే మాటను ఆయన వ్యతిరేకించారు. తాడు బొంగురం లేనివారు ఏదైనా మాట్లాడుతారని, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. తమ పార్టీకి ఓ సిద్ధాంతం, ఆలోచన, విధానం ఉన్నాయని, మిగతావారి లాగా తాము మాట్లాడలేమని ఆయన అన్నారు. ఏమైనా ఎన్నికల్లో జయాపజయాలను ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications