నాపై పోటీ చేస్తే తెరాస స్వయంకృతమే: కొండా సురేఖ

వైయస్ రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వం అదే కుటుంబాన్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఇప్పుడు ప్రజలకు అవకాశం వచ్చిందని ఆమె అన్నారు. రాజీనామా చేసిన ఆరు నెలలకు ప్రభుత్వం తమపై వేటు వేసిందని, దీన్ని బట్టి ప్రభుత్వానికి ఎంత భయంగా ఉందో అర్థమవుతుందని ఆమె అన్నారు. తెలంగాణలో ఒక్క నియోజకవర్గమైనా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. వేటు పడిన 16 మంది శాసనసభ్యుల్లో తెలంగాణ నుంచి కొండా సురేఖ ఒక్కరే ఉన్నారు.
కాగా, తమపై అనర్హత వేటు వేయడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు ఆహ్వానిస్తున్నారు. తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి శాసనసభలో అడుగు పెడతామని వారంటున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బాబూరావు తిరుమలలో అన్నారు. అనర్హత వేటు పడిన తాము 17 మందిమి వైయస్ కాంగ్రెసు పార్టీ తరఫున శాసనసభలోకి అడుగు పెడతామని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కలలు గన్న రాజ్యం తేవడం జగన్‌కే సాధ్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications