హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామోజీరావు భూసర్వేపై జగన్ సాక్షి డైలీ అటాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramoji Rao
హైదరాబాద్: ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీ రావు భూమి సర్వే వ్యవహారంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి డైలీ శనివారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ మండలం కోహెడ గ్రామంలో రామోజీ ఫిలింసిటీ భూకబ్జాకు పాల్పడినట్లు అనుమానించిన అధికారులు శుక్రవారం సర్వేకు దిగినట్లు ఆ పత్రిక రాసింది. రామోజీ రావు 15 ఎకరాల సీలింగ్ భూమిని రామోజీరావు కబ్జా చేసినట్లు సాక్షి దినపత్రిక ఆరోపించింది. 15 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసిన రామోజీ రావు మరో 15 ఎకరాల మిగులు భూమిని తన ఆధీనంలోకి తీసుకున్నట్లు గుర్తించిన ఉమర్‌ఖాన్ గూడా గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారని ఆ పత్రిక రాసింది.

సాక్షి దినపత్రిక కథనం ప్రకారం - ఆరు నెలల క్రితం రామోజీ ఆధీనంలో ఉన్న మిగులు భూమిని ఇళ్ల స్థలాల కోసం చదును చేసేందుకు ఉపక్రమించారు. అయితే ఫిలింసిటీ సిబ్బంది గ్రామస్థులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రామోజీ భూములను సర్వే చేసి మిగులు భూములుంటే గుర్తిస్తామని అధికారులు గ్రామస్థులకు హామీ ఇచ్చారు. దీంతో అప్పుడు పరిస్థితి సద్దుమణిగింది.

ఆ తర్వాత అధికారులు పట్టించుకోలేదని సాక్షి దినపత్రిక ఆరోపించింది. ఎట్టకేలకు శుక్రవారం అధికారులు కదిలారని చెప్పింది. అనాజ్‌పూర్ గ్రామపరిధిలోనుూ 60.10 ఎకరాల మిగులు భూమి కూడా రామోజీ ఫిలిం సిటీ ఆక్రమణలో ఉన్నట్లు తేలిందని, దాంతో దాన్ని మిగులు భూమిగా గుర్తించి జాయింట్ కలెక్టర్ కోర్టుకు వెళ్లారని, దీనిపై రామోజీ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసిందని, దీనిపై ఉషా కిరణ్ మూవీస్ హైకోర్టును ఆశ్రయించిందని సాక్షి దినపత్రిక రాసింది.

English summary
According to YS Jagan's Sakshi daily - Officers started survey in ramoji Rao's lands at film city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X