ఆంధ్రలో చిచ్చుకు కెసిఆర్ ప్రయత్నం: టిజి వెంకటేష్

కొందరి వ్యక్తిగత ప్రతిష్ట కోసమే ఉప ఎన్నికలు తీసుకువచ్చారని హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. ఉద్యమంలో పెట్టిన కేసులను దశలవారీగా ఎత్తివేస్తామనే నమ్మకం ప్రజల్లో కలిగిందని ఆమె శనివారం మహబూబ్‌నగర్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ అంశానికి కాంగ్రెసు కట్టుబడి ఉందని ఆమె చెప్పారు. తెలంగాణపై తమ పార్టీకి ఎప్పటి నుంచో స్పష్టత ఉందని ఆమె అన్నారు.
తమ కాంగ్రెసు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎమ్మెల్సీలపై కూడా త్వరలో వేటు పడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్లులో అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై స్పీకర్ వేటు వేయడం సముచితమేనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో కాంగ్రెసు గెలుస్తుందని, మిగిలిన స్థానాల్లో రెండో స్థానంలో ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications