నాగర్‌కర్నూలు ఇండిపెండెంట్ అభ్యర్థి కిడ్నాప్, ఆందోళన

తెలిసిన వివరాల ప్రకారం - నామినేషన్‌ను ఉపసంహరించుకోవడానికి ఆర్డీవో కార్యాలయానికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు కారులో వచ్చి ఎద్దుల జనార్దన్ రెడ్డితో మాట్లాడారు. వారే ఎద్దుల జనార్దన్ రెడ్డిని కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. తెలంగాణపై చంద్రబాబు నాయుడి వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీకి, శానససభా సభ్యత్వానికి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడంతో నాగర్‌కర్నూలు సీటుకు ఉప ఎన్నిక జరుగుతోంది. నాగం జనార్దన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మద్దతిస్తోంది. కాంగ్రెసు అభ్యర్థిగా దామోదర్ రెడ్డి, తెలుగుదేశం అభ్యర్థిగా మర్రి జనార్దన్ రెడ్డి పోటీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications