శ్రీకాకుళం: నరసన్నపేటలో విజయం తనదేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ శాసనసభ్యుడు ధర్మాన కృష్ణ దాసు శనివారం అన్నారు. ఉప ఎన్నికల్లో కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేసినా విజయం తనదేనన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో హస్తం గుర్తుపై కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినా ఆయన మరణానంతరం ఆయన అభిమానిగా ఉండిపోయానని చెప్పారు. వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు అమలుకానందున కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో కడప ఫలితాలు పునరావృతమవుతాయని చెప్పారు.
కాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు లభించింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక రిటర్నింగ్ అధికారి స్వతంత్ర అభ్యర్థులు, రిజిస్టర్ పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాచింయారు. ప్రసన్న కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఆయనకు సీలింగ్ ఫ్యాన్ గుర్తు కేటాయించారు.