మెదక్: కూర బాగా లేదని ఓ కొడుకు తల్లిని హత్య చేసిన దారుణ సంఘటన మెదక్‌జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో ఆదివారం చోటు చేసుకుంది. రంగంపేట గ్రామానికి చెందిన తలారి గంగమ్మ(55)కు ఇద్దరు కుమారులు. మొదటి కొడుకు మృతి చెందడంతో గంగమ్మ రెండో కుమారుడైన నర్సింహులు వద్ద ఉంటోంది. నర్సింహులును భార్య వదిలేసి వెళ్లడంతో గంగమ్మే కొడుక్కి వంట చేసి పెడుతోంది.
ఆదివారం ఇంటికొచ్చిన కొడుక్కి భోజనం పెట్టింది. తీరా ఆమె శనివారం వండిన వంకాయ కూరే వేయడంతో నర్సింహులు మండిపడ్డాడు. అంతేకాకుండా, విచక్షణ కోల్పోయి తల్లిని వెంటాడి హత్య చేశాడు. చుట్టు పక్కల వారు అడ్డుకునే యత్నం చేసినా వినిపించుకోలేదు. కొడుకు దెబ్బలకు తట్టుకోలేక ఆమె పడిపోయింది.