అమ్మాయిలపట్ల అసభ్య ప్రవర్తన: టీచర్లకు దేహశుద్ధి

Krishna District Map
విజయవాడ/ఖమ్మం: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఇద్దరు టీచర్లకు వేరు వేరు చోట్ల సోమవారం దేహశుద్ది చేశారు. కృష్ణా జిల్లాలోని నందిగామలోని ఓ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ టీచర్‌ను పాఠశాల యాజమాన్యమే పోలీసులకు పట్టించింది. మోహన్ రావు అనే టీచర్ గత కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయంపై పాఠశాల యాజమాన్యం ఆయనను పలుమార్లు మందలించింది. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో సదరు టీచర్ సెలవులపై ఊరికి వెళ్లి పోయాడు. అయితే సోమవారం తన జీతం కోసం పాఠశాలకు వచ్చాడు. పాఠశాల యాజమాన్యం అతనిని జీతం ఇచ్చి వదిలి పెట్టకుండా స్థానికులకు అప్పగించింది. దీంతో స్థానికులు ఆయనకు దేహశుద్ధి చేశారు. స్కూల్ యాజమాన్యం, స్థానికులు కలిసి అతనిని పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మోహన్ రావు గుంటూరు జిల్లా వాసి.

కాగా ఖమ్మం జిల్లాలో విద్యార్థులను వేధించిన కీచక ప్రిన్సిపల్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఖమ్మం పట్టణంలోని ముస్తఫానగర్‌లోని శారద పాఠశాల ప్రిన్సిపల్ ట్యూషన్‌కు వస్తే ప్రత్యేక పాఠాలు చెబుతానంటూ విద్యార్థినులను ద్వందార్థాల మాటలతో వేధిస్తుండటంతో ఆ విషయాన్ని వారు తల్లిదండ్రులకు తెలియ జేశారు. దాంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌ను నిలదీయడమే కాకుండా ఆయనపై చేయి చేసుకున్నారు. అనంతరం నిందితుడిని వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, విద్యార్థుల ఫీజులు తగ్గించమని అడిగినా తగ్గించానని, మరో స్కూలుతో చేతులు కలిపిన తల్లిదండ్రులు తనపై ఆరోపణలు చేసి దాడి చేశారని ప్రిన్సిపల్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+