జగన్ గాలి వీస్తోంది, 2014లో క్లీన్ స్వీప్: జూపూడి

ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తప్పకుండా పడుతుందని ఆయన అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరుతో పాటు, రాబోయే 17 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలోనూ వైయస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ అధికారంలోకి రావటం చూసి, టిడిపి చంకలు గుద్దుకోవడం అవివేకమన్నారు. అక్కడ అఖిలేష్ యాదవ్‌ను చూసి ఓట్లేశారు. ఇక్కడా చంద్రబాబును నమ్మరు కాబట్టి, ఆయన కొడుకు లోకేష్ కుమార్‌ను తిప్పగలిగితే ప్రజలకు కొత్తదనంగా ఉండి, టిడిపికి డిపాజిట్లు అయినా దక్కుతాయేమోనని జూపూడి ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications