జగన్ యాత్రల వల్ల ఖర్చు భారమే మిగులుతుంది!: జెసి

JC Diwakar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి యాత్రల వల్ల ఆయనకు ఖర్చు భారం మిగలడం తప్ప మరే లాభముండదని అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి మంగళవారం అన్నారు. బహిరంగ సభలకు జనాలను తరలించినంత మాత్రానే ఓట్లు రాలవని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బహిరంగ సభలకు లారీల్లో, బస్సుల్లో జనాలను తరలించే విధానానికి స్వస్తి పలకాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గతంలో కొందరు రాజకీయ నాయకుల సభలకు భారీగా జనాలు వచ్చినా, ఆ స్థాయిలో ఓట్లు పడక ఆయా పార్టీల అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.

తన ప్రాంతంలో ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన దీక్ష కోసం జనాలను తరలించారని, ఓదార్పు యాత్ర కోసం కూడా జనాలను తీసుకువచ్చారని అన్నారు. ఈ ఖర్చంతా ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల వ్యవహారంలో హంగామాతో లాభం లేదని ఖర్చుల భారం మాత్రమే మిగులుతుందని అన్నారు. అన్ని పార్టీలు భారీ సభలు నిర్వహిస్తూ అనవసరంగా ఖర్చు చేస్తున్నాయన్నారు. జగన్ యాత్రలకు జన సమీకరణ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారన్నారు. కారుకి డీజిల్ కాకుండా రు. వెయ్యి అద్దె, అందులో వచ్చే ఆరుగురికి ఖర్చుల కింద మరో వెయ్యి వరకు వెచ్చించాల్సి ఉంటుందని.. వీటి వల్లఉపయోగం ఎంతని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+