జగన్ హవా తగ్గుతోంది,కడపలో ఉన్నంత ఉండదు: జెసి

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై సానుభూతి తగ్గిపోతోందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సభలకు, ప్రచార యాత్రలకు వచ్చిన వారు అందరూ ఓటు వేయరని ఆయన అన్నారు. కాగా జగన్మోహన్ రెడ్డి యాత్రల వల్ల ఆయనకు ఖర్చు భారం మిగలడం తప్ప మరే లాభముండదని జెసి మంగళవారం అన్న విషయం తెలిసిందే. బహిరంగ సభలకు జనాలను తరలించినంత మాత్రానే ఓట్లు రాలవని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బహిరంగ సభలకు లారీల్లో, బస్సుల్లో జనాలను తరలించే విధానానికి స్వస్తి పలకాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గతంలో కొందరు రాజకీయ నాయకుల సభలకు భారీగా జనాలు వచ్చినా, ఆ స్థాయిలో ఓట్లు పడక ఆయా పార్టీల అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications