స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టే యోచనలో చంద్రబాబు

విద్యుత్ పై చర్చ పూర్తి కాకుండానే సభను వాయిదా వేయడంపై బాబు మండిపడ్డారు. స్పీకర్ తీరుతో తాము విసిగి పోయామని, అవిశ్వాసం పెట్టడం మినహా తమ ముందు మరో అవకాశం లేదని చంద్రబాబు అన్నట్లుగా తెలుస్తోంది. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా చేయాల్సిందంతా చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తీరు దున్నపోతుపై వర్షం పడినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అవినీతి విషయంలో సర్కారుది రికార్డ్ అన్నారు. ముఖ్యమంత్రిది బాధ్యతారాహిత్యమన్నారు. ఎన్నివిధాలుగా చెప్పినా ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదన్నారు. స్పీకర్ తీరు అధికార పక్షానికి కొమ్ము కాసే విధంగా ఉందన్నారు. స్పీకర్ పై అవిశ్వాసం పెట్టే విషయం ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఐదు రాష్ట్రాలలో అసమర్థులను ప్రజలు తిప్పి కొట్టారన్నారు. జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ ఏర్పడుతుందన్నారు. అది ఏ సమయంలోనైనా ఏర్పడవచ్చునని అన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. మోత్కుపల్లికి వస్తున్న బెదిరింపు కాల్స్ పైన బాబు ముఖ్యమంత్రి, డిజిపికి లేఖ రాశారు.












Click it and Unblock the Notifications