రాహుల్ గాంధీ గ్రౌండ్ రియాల్టీ తెలుసుకున్నారు: విహెచ్

ఉప ఎన్నికలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుకుంటే సరిపోదని, పార్టీ సీనియర్ నాయకులను భాగస్వాములను చేయాలని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థులను ఓడించడానికి అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇప్పటి నుంచే ప్రారంభం కావాలని ఆయన సూచించారు. పిలిచినా, పిలువకపోయినా తాను ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తానని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేస్తారని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో ప్రచారానికి తాను వెళ్తానని ఆయన చెప్పారు. తెలంగాణ తెచ్చే సత్తా తమకు మాత్రమే ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications