వైయస్ జగన్ నెల్లూరు జిల్లా టూర్‌లో ఘర్షణ, ఉద్రిక్తత

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రోడ్‌షో మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఇందుకూరుపేట మండలం జగదేవిపేట, కొత్తూరు, ఇందుకూరుపేటలలో రోడ్‌షో ముగించుకుని వస్తున్న జగన్ కాన్వాయ్‌ను జంగంవారిదొరువు గ్రామస్థులు అడ్డుకుని, తమ గ్రామంలోకి కూడా రావాలని పట్టుబట్టారు. సమయాభావం వల్ల రాలేకపోతున్నానని వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. సోమరాజుపల్లి, కొరుటూరు మీదుగా మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మైపాడుకు జగన్ చేరుకున్నారు.
మైపాడు తుపాను షెల్టర్ సమీపానికి ఆయన చేరుకునేసరికి సుమారు పదిమంది మత్స్యకారులు అక్కడకు వెళ్లి, ప్రచార రథం నుంచి కిందకు దిగాలని జగన్‌ను కోరారు. వారిలో కొందరు జగన్‌కు పూలదండలు వేసేందుకు పోటీపడ్డారు. జగన్ సెక్యూరిటీ సిబ్బంది వారిని ఓ పక్కకు తోసేశారు. వాళ్లకు, స్థానిక మత్స్యకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో జగన్ వాహనం కొంత ముందుకు వెళ్లింది. దాంతో మత్స్యకారులు మరోసారి జగన్‌ను కలిసేందుకు వెళ్లబోయారు. సెక్యూరిటీ సిబ్బంది వాళ్లను మళ్లీ నెట్టారు. దాంతో వారి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది.












Click it and Unblock the Notifications