ములాయం, అఖిలేష్‌లపై వేలాడుతున్న సిబిఐ కత్తి

Mulayam Singh Yadav
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ శానససభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై సిబిఐ కత్తి వేలాడుతోంది. ఐదేళ్లనాటి సిబిఐ విచారణకు సంబంధించిన కేసు మళ్లీ ముందుకు వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కేసు. ములాయం, ఆనయ కుమారులు అఖిలేష్, ప్రతీక్, కోడలు డింపుల్ ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని, ఈ కేసు విచారణను కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని సిబిఐ 2007 అక్టోబర్ 26వ తేదీన సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసింది.

ప్రాథమిక నివేదికను తదుపరి చర్యల నిమిత్తం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ వ్యవహారం నలుగుతుండగానే కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. ఇండో - అమెరికన్ అణు ఒప్పందంపై విశ్వాస పరీక్ష సమయంలో యుపిఎకి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 39 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు అవసరమైంది. దీంతో కేంద్రం ములాయం, ఆయన కుటుంబ సభ్యులపై సిబిఐ విచారణ విషయంలో వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.

రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో తాము 2007 అక్టోబడర్ 26వ తేదీన దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సిబిఐ సుప్రీంకోర్టును కోరింది. 2008 డిసెంబర్ 6వ తేదీన సిబిఐ ఆ పిటిషన్ దాఖలు చేసింది. లెక్కల్లో కొన్ని తప్పులు దొర్లడం వల్ల ములాయం, ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే తప్పుడు అంచనాకు వచ్చామని సిబిఐ తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు బెంచ్ న్యాయవాదులు అల్తమాస్ కబీర్, సిరైక్ జోసెఫ్ తమ నిర్ణయాన్ని రిజర్వ్ చేసుకున్నారు. ఇప్పటికీ సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడలేదు. జోసెఫ్ పదవీ విరమణ చేశారు. ఈ స్థితిలో ములాయం సింగ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సమస్య ఉత్పన్నం కావచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+