యడ్యూరప్పకు ఊరట: అక్రమ మైనింగ్ కేసు కొట్టివేత

తన వాదనను వినిపించే అవకాశం కల్పించకుండా ప్రోసీడింగ్స్‌ను ప్రారంభించారని యడ్యూరప్ప తెలిపిన అభ్యంతరాన్ని హైకోర్టు సమర్థించింది. హైకోర్టు తాజా ఆదేశాలతో యడ్యూరప్ప నైతికంగా బలపడినట్లయింది. అప్పటి లోకాయుక్త సంతోష్ హెగ్డే అక్రమ మైనింగ్‌పై గత జూలై 27వ తేదీన నివేదిక సమర్పించారు. దాని ఆధారంగా యడ్యూరప్ప రాజీనామాకు బిజెపి కేంద్ర నాయకత్వం ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆయన జూలై 31వ తేదీన రాజీనామా చేశారు.
యడ్యూరప్ప కుటుంబానికి చెందిన ప్రేరణ ట్రస్టుకు సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీ 10 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిందని, రాచెన్‌హళ్లిలో 1.02 ఎకరాల భూమి కొనుగోలుకు మైనింగ్ కంపెనీ 20 కోట్ల రూపాయలు చెల్లించిందని లోకాయుక్త ఆరోపించింది.












Click it and Unblock the Notifications