యుపిఎపై ప్రభావం ఉండదు: ఫలితాలపై సోనియా

పంజాబ్‌లో తిరుగుబాటు అభ్యర్థులు దెబ్బ తీశారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల తాము గెలవలేకపోయామని ఆమె అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓటమికి నాయకత్వ లోపం కూడా కారణమని, నాయకులు ఎక్కువయ్యారని ఆమె అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ మూలాలు పటిష్టంగా లేవని ఆమె అన్నారు. ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సోనియా చెప్పారు. గోవాలో ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఓడిపోయామని ఆమె చెప్పారు. తాము గెలిచామా, లేదా అనేది పక్కన పెడితే ప్రతి ఎన్నిక తమకు గుణపాఠమేనని ఆమె అన్నారు.
అవినీతిపై తీవ్రంగా పోరాడింది కాంగ్రెసు పార్టీయేనని ఆమె చెప్పారు. లోక్‌పాల్ బిల్లును రాజ్యసభలో అడ్డుకున్నదెవరని ఆమె ప్రశ్నించారు. ధరల పెరుగుదల కూడా తమ ఓటమికి ఓ కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో విజయానికి తీవ్రంగా కృషి చేశామని, ప్రజలు ఆదరించలేదని ఆమె అన్నారు. తప్పులు సరిదిద్దుకుంటామని ఆమె చెప్పారు. గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతున్నామని ఆమె చెప్పారు. ఐదు రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలపై ఆమె బుధవారం ఉదయం పార్టీ నాయకులతో సమీక్షించారు.












Click it and Unblock the Notifications