వైయస్ జగన్ అరెస్టుపై స్టూడియోఎన్ కథనాలు

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టుపై స్టూడియోఎన్ టీవీ చానెల్ వరుస వార్తాకథనాలను ప్రసారం చేస్తోంది. కొద్ది రోజులుగా ఆ వార్తాకథనాలు ప్రసారమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మామకు చెందిన ఈ టీవీ చానెల్ గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ చేతిలోకి వెళ్లిపోయింది. దాంతో చంద్రబాబుకు సంబంధించిన వార్తలు, తెలుగుదేశం అనుకూల వార్తాకథనాలు విరివిగా వచ్చేవి. వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా వార్తాకథనాలు వచ్చేవి. కానీ ఆ తర్వాత ఆ టీవీ చానెల్ జూనియర్ ఎన్టీఆర్ చేతిల్లోకి వెళ్లిందని అంటారు. ఆ ప్రచారానికి అనుగుణంగానే తెలుగుదేశం అనుకూల వార్తలు పూర్తిగా తగ్గిపోయాయి.

ఇప్పుడు వైయస్ జగన్ అరెస్టుపై, రాజకీయ భవిష్యత్తుపై వరుస కథనాలు వస్తున్నాయి. అవి జగన్‌కు అనుకూలమో, వ్యతిరేకమో కూడా అర్థం కాని స్థితి. ఏప్రిల్ 2వ తేదీలోగా జగన్ అరెస్టు అవుతారంటూ ఇటీవల ఆ టీవీ చానెల్ అదరగొట్టింది. దానిపై ప్రత్యేక వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. తాజాగా జగన్ ఒకే ఒక్కడు అంటూ మరో వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ప్రత్యర్థుల ఆరోపణలతో, సిబిఐ దర్యాప్తుతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వ్యాఖ్యానించింది.

రాష్ట్ర రాజకీయాల్లో జగన్ ఒంటరివాడయ్యారని కూడా ఆ టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. జగన్ అరెస్టయితే పరిస్థితి ఏమిటనేది కూడా విశ్లేషించే ప్రయత్నం చేసింది. పార్టీని ముందుకు నడిపించడానికి జగన్ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా వ్యాఖ్యానించింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలతో ఆ వార్తాకథనాన్ని స్డూడియోఎన్ ప్రసారం చేసింది. తెలుగు టీవీ చానెళ్లు ఎటో ఓ దిక్కు అయిపోయిన నేపథ్యంలో వాటి కన్నా భిన్నంగా ఉండడానికి ప్రయత్నిస్తోందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+