గాలి ఆస్తుల గుట్టు విప్పుతున్న పిఎ అలీఖాన్

అలీఖాన్ వెల్లడించిన సమాచారంతో గాలి జనార్దన్ రెడ్డి అదనపు ఆస్తుల గుర్తింపునకు సిబిఐ రాయచూరులో పర్యటించనున్నట్లు సమాచారం. బిజెపి కర్ణాటకలో అధికారం చేపట్టిన రెండేళ్లలో గాలి జనార్దన్ రెడ్డి ఆస్తులు వేయి రెట్లు పెరిగినట్లు ఒక అంచనా. ఇనుము, ఉక్కు, రవాణా సంస్థల నుంచి మామూళ్లుగా నెలకు వంద నుంచి 150 కోట్ల రూపాయల వరకు వచ్చేదని, ఈ సంస్థల నుంచి మామూళ్ల వసూలును అలీఖాన్ చూసుకునేవాడని, గనుల సంస్థల నుంచి వసూలయ్యే ఖనిజాన్ని ఓ శాసనసభ్యుడు చూసుకునేవాడని అంటారు. ఆయా సంస్థల నుంచి అక్రమంగా తవ్విన ఖనిజం పరిమాణంలో 30 శాతం వరకు మామూలుగా వసూలు చేసేవారని అంటున్నారు.












Click it and Unblock the Notifications