ముఖ్యమంత్రి పీఠంపైనే జగన్ కన్ను: దామోదర

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తనకు ఏ విధమైన విభేదాలు లేవని ఆయన శనివారం ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలుంటే తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతానని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ పేరు మీద ఎంత మంది నాయకులు వచ్చారు, ఎంత మంది నాయకులుగా ఎదిగారని ఆయన అడిగారు. తెలంగాణ అంశం తన చేతుల్లో లేదని ఆయన అన్నారు. తెలంగాణపై తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి తెలియజేసినట్లు ఆయన తెలిపారు.
తన వెంట ఉన్నవారు తనకు ఎందుకు దూరమయ్యారో వారినే అడగాలని ఆయన సూచించారు. దళితుడిని అయినందుకే తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిందని ఆయన చెప్పారు. ఎవరి కోసం కూడా తన ప్రవర్తనను మార్చుకోబోనని ఆయన స్పష్టం చేశారు. చమర్ సమ్మేళనం నిర్వహణలో ఏ విధమైన రాజకీయం లేదని, తాత్విక చింతన, ఆధ్యాత్మిక భావన కోసమే ఈ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రితో విభేదించాల్సి వస్తే విభేదిస్తానని, తన అభిప్రాయం చెబుతానని ఆయన అన్నారు. స్వీకరిస్తారా, లేదా అనేది ముఖ్యమంత్రి ఇష్టమని, తన అభిప్రాయం మాత్రం కచ్చితంగా చెబుతానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications