వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మా దయతోనే కెసిఆర్ ఎంపి అయ్యారు: చంద్రబాబు

కుటుంబ సభ్యులను తెచ్చి ఎన్నికల పేరుతో దందాలు, వసూళ్లు చేస్తున్నారని ఆయన కెసిఆర్‌పై ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం పేరుతో పార్టీ పెట్టి కాంగ్రెసు కంపులో కలిసిపోయారని ఆయన చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. తమది పేదల పార్టీ అని, పేదల పార్టీని దెబ్బ తీయాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ దెబ్బ తీయాలనుకునేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. కాంగ్రెసు ఎనిమిదేళ్ల పాలనలో పేదలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. బిజెపికి ఓటేస్తే రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు.