హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంఘీ పాలియస్టర్ ఆస్తుల జప్తు యత్నం: ఉద్రిక్తత

By Pratap
|
Google Oneindia TeluguNews

Sanghi
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్‌కు సమీపంలో గల సంఘీ నగర్‌లో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాకీల కోసం సంఘీ పాలియస్టర్ ఆస్తుల జప్తునకు అంచనా వేయడానికి బ్యాంక్ అధికారులు రావడంతో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు జీతాలు చెల్లించిన తర్వాతనే ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు 30 కోట్ల రూపాయల మేర వేతనాలు చెల్లించాల్సి ఉందని కార్మికులు చెబుతూ ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కార్మికులపై పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు. సంఘీ పాలియస్టర్ సంస్థ మాజీ పార్లమెంటు సభ్యుడు, వార్త దినపత్రిక యజమాని గిరీష్ సంఘీ సోదరుడు సుధీర్ సంఘీది.

సంఘీ పాలియస్టర్ 18 బ్యాంకులకు 2 వేల కోట్ల రూపాయల మేరకు బాకీ పడింది. ఆ 18 బ్యాంకుల అధికారులు శనివారం సంఘీ నగర్ వచ్చారు. బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేసినా సంస్థ పట్టించుకోవడం లేదు. దీంతో కోర్టు అనుమతితో నేరుగా బ్యాంకు అధికారులు రంగంలోకి దిగారు. పోలీసులకు ముందు సమాచారం అందించి వారు ఇక్కడికి వచ్చారు. భారీగా పోలీసులు మోహరించారు. తొలుత కార్మికులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినలేదు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు.

English summary
Tension prevailed at Sanghi Nagar, as Bank officers came attach properties of Sanghi Polyester.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X