వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి ఖాతాల నుంచి నేతలకు రూ. 200 కోట్లు బదిలీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బెంగుళూరు: అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఏఎంసీ) కేసులో బెంగుళూరు సీబీఐ కస్టలో ఉన్న గాలి జనార్దన్‌రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. గాలి బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఖాతాల నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నేతలకు రూ. 200 కోట్ల నిధులు బదిలీ అయినట్లు బెంగుళూరు సీబీఐ అధికారులు గుర్తించినట్లు ఓ ప్రముఖ మీడియా వెల్లడించింది. గాలి జనార్దనమ్ రెడ్డి సిబిఐ కస్టడీ సోమవారంతో ముగియనుంది. అయితే ఈ విచారణ కొలిక్కి రాని కారణంగా ఆయనను మరో వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాల్సిందిగా సీబీఐ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది.

గాలి జనార్ధన్‌రెడ్డి పిఏ ఆలీఖాన్‌ను కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అలీఖాన్ పలు కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. జనార్ధన్‌రెడ్డికి సంబంధించిన పలు ఆస్తులు, ఆదాయ వివరాలను ఆలీఖాన్ సీబీఐ విచారణలో వెల్లడించినట్లు తెలియవచ్చింది. అక్రమ రవాణా చేసే ముడి ఇనుముకు మైనింగ్ కంపెనీలు దాని విలువలో 30 శాతం చొప్పున మామూళ్లు చెల్లించారని ఆలీఖాన్ చెప్పినట్లు సమాచారం. కాగా గాలి జనార్ధన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ సీబీఐ అధికారులు గత సెప్టెంబర్ నెలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడే ఏఎంసీ కేసు విషయమై కర్నాటక సీబీఐ అధికారులు గాలిని, ఆయన పీఏ అలీఖాన్‌ను విచారణ చేస్తున్నారు.

English summary
According to media reports - About Rs 200 crores were transferred to political leaders from Gali Janardhan reddy's accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X