ఆ తర్వాత జగన్, బాబును చెప్పుతో కొట్టాలి:లక్ష్మీపార్వతి

Laxmi Parvathi
నెల్లూరు: అవినీతి చక్రవర్తి అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాను నీతివంతుడనని సుప్రీం కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని భుజాలు ఎగురవేస్తున్నారని, ఆయన్ను చెప్పులతో కొట్టాలని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి శనివారం అన్నారు. లక్ష్మీ పార్వతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా నేతలు నాడు స్వర్గీయ ఎన్టీఆర్ నిన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నేడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దుష్టశక్తులు నాడు ఎన్టీఆర్ ను, నిన్న వైయస్సార్‌ను పొట్టన పెట్టుకున్నాయన్నారు.

గ్యాస్ నిక్షేపాల విషయంలో వైయస్సార్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి అడ్డుపడినందుకే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రిలయన్స్ కుమ్మక్కై వైయస్సార్‌పై కక్ష కట్టారన్నారు. ఆయన మృతిపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని, వాటికి కాంగ్రెసు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు. తాను నీతివంతుడనని బాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. చంద్రబాబుకు రామోజీ రావు చెంచాగిరి చేస్తూ వార్తలు ప్రచురిస్తున్నారని విమర్శించారు. ఫలితంగానే రామోజీ సంస్థలో రిలయన్స్ పెట్టుబడులు పెట్టిందని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+