హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎంకు తలనొప్పి, న్యాయ సలహా తర్వాతే మంత్రులపై...

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రులను సమర్థించడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకుంటోంది. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులను, అధికారులను సమర్థించాలా, వ్యక్తిగత పోరాటానికి వారికే వదిలేయాలా అనే డైలమాలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మంత్రులు పి. సబితా ఇంద్రా రెడ్డిత, జె. గీతా రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మినారాయణ, మోపిదేవి వెంకటరమణలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 జీవోలను ప్రాతిపదికగా తీసుకుని సిబిఐ వైయస్ జగన్ ఆస్తుల కేసుపై దర్యాప్తు చేస్తోంది. ఈ జీవోల ద్వారా వివిధ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చారని, అందుకు ప్రతిగా ఆ కంపెనీలు జగన్ సంస్థల్లో ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని ఆరోపిస్తున్నారు. ఆరుగురు మంత్రుల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే విషయంపై కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకోలేకపోతున్నారు. వారిని రాజీనామా చేయాలని అడిగే శక్తి ఆయనకు లేదు. అలా అడిగితే ప్రభుత్వానికే ముప్పు ఏర్పడవచ్చు. తెలుగుదేశం పార్టీ నుంచే కాకుండా ఇతర ప్రతిపక్షాల నుంచి కూడా మంత్రుల విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది.

తన భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవడానికి ఆరు మంత్రుల్లో నలుగురు శానససభ లాబీలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిని గీతా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, కన్నా లక్ష్మినారాయణ మంగళవారం కలిశారు. సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులపై న్యాయ సలహాను కోరుతున్నట్లు ముఖ్యమంత్రి వారికి చెప్పారు. జీవో జారీలో తాము నిబంధనలను ఉల్లంఘించలేదని మంత్రి గీతా రెడ్డి అంటున్నారు. తెర వెనక వ్యవహారాలతో తమకు సంబంధం లేదని ఆమె చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ జగన్‌ను ఎందుకు వెనకేసుకొని వస్తుందో అర్థం కావడం లేదని ఆమె అన్నారు.

English summary
AP government began seeking legal opinion on how to defend the six ministers in a case involving alleged illegal assets of MP Y.S. Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X