హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊరట: ఎమ్మార్ విల్లాల రిజిస్ట్రేషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: ఎమ్మార్ విల్లాల రిజిస్ట్రేషన్ విషయంలో విల్లాల కొనుగోలుదారులకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో మంగళవారం ఊరట లభించింది. విల్లాల రిజిస్ట్రేషన్‌లను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జివోను హైకోర్టు కొట్టివేసింది. విల్లాల రిజిస్ట్రేషన్‌లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విల్లాల రిజిస్ట్రేషన్ వల్ల సిబిఐ దర్యాఫ్తునకు ఎలాంటి ఆటంకం కలగదని హైకోర్టు పేర్కొంది. కొనుగోలుదారుల పేర్ల పైన రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే విల్లాల యజమానులు ఎపిఐఐసి పేరిట చదరపు గజానికి రూ.పదిహేను వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎపిఐఐసి పేరిట డబ్బులను డిపాజిట్ చేయాలని సూచించింది.

కాగా ఎమ్మార్‌లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు విల్లాల కొనుగోలుదారులను సిబిఐ విచారించింది. ఎమ్మార్ కారణంగా ఎపిఐఐసి భారీగా నష్టపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మార్ విల్లాల రిజిస్ట్రేషన్‌లను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం జివో జారీ చేసింది. దీనిపై బాధితులు కోర్టుకెక్కారు.

English summary
High Court gave green signal to EMAAR villas registration today. Court dismissed government GO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X