వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ కోటి అంటే కిరణ్ 15 లక్షలంటున్నారు: హరికృష్ణ

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారని, అవి ఎటు పోయాయో అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మూడేళ్లలో పదిహేను లక్షల ఉద్యోగాలు అంటున్నారని ఇవన్నీ సాధ్యమయ్యే పనా అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపింది టిడిపి మాత్రమేనన్నారు. వెనుకబడిన తెలంగాణ బాగుకోసం పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయించింది స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో అన్ని స్థానాలను టిడిపి కైవసం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.