• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉత్తరాఖండ్‌లో ముసలం, కేంద్ర మంత్రి రాజీనామా

By Pratap
|

Harish Rawat
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్తరాఖండ్ కాంగ్రెసులో ముసలం బయలుదేరింది. అది యుపిఎ ప్రభుత్వాన్ని తాకింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడిన కేంద్ర సహాయ మంత్రి హరీష్ రావత్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అందించినట్లు సమాచారం. తనను విస్మరించి, పార్లమెంటు సభ్యుడు విజయ్ బహుగుణను ముఖ్యమంత్రి పదవికి అధిష్టానం ఎంపిక చేయడంపై అసంతృప్తికి గురైన హరీష్ రావత్ రాజీనామా చేశారు.

ముఖ్యమంత్రి ఎవరనేది శాసనసభ్యులు నిర్ణయించుకుంటారని, విజయ్ బహుగణను ముఖ్యమంత్రి పదవికి ఎన్నుకున్నారని కాంగ్రెసు సీనియర్ నేత, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పారు. రావత్ రాజీనామా చేశారనే వార్తను ప్రధాని కార్యాలయం తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి పదవికి రావత్‌ను విస్మరించడం ఇది రెండోసారి. గతంలో హరీష్ రావత్‌ను తోసిపుచ్చి ఎన్డీ తివారీకి కాంగ్రెసు నాయకత్వం మఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. ఇది ఒత్తిడి రాజకీయమని, దాన్ని పరిష్కరిస్తామని బహుగుణ చెప్పారు.

English summary
In a further setback to the ruling UPA government, Minister of State for Parliamentary Affairs, Harish Rawat has reportedly submitted his resignation. He is believed to have submitted his resignation to Prime Minister Manmohan Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X