లోకసభలో కళ్లు తిరిగి పడిపోయిన శరద్ పవార్

వృద్ధాప్యం, లో బిపి కారణంగానే శరద్ పవార్ కళ్లు తిరిగి పడిపోయినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. అనంతరం అతనిని ఆయన చాంబరులో విశ్రాంతి కల్పించారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఆర్ఎంఎల్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కాగా శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న వేధింపులపై చర్చ చేపట్టాలని విపక్షాలు రాజ్యసభలో పట్టుబట్టాయి. దాంతో రాజ్యసభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు. శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న అత్యాచారాలపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ తమిళ పార్టీలు తీవ్ర నిరశన తెలిపాయి. ఈ అంశాన్ని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తామని ప్రణబ్ ముఖర్జీ లోకసభలో ప్రకటించారు.












Click it and Unblock the Notifications