వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టు జడ్జిపైకి షూ విసిరిన మహిళ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Map
ముంబై: సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైకి షూ విసిరిన మహిళల్లో ఒక్కరైన పార్వతి మరుళిని ఢిల్లీ విమానాశ్రయంలో సోమవారం అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు బెంచ్ న్యాయమూర్తులు అర్జిత్ పసాయత్, ఎకె గంగూలీలపైకి 2009లో ముగ్గురు మహిళలు షూ విసిరారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న పార్వతి మురళి సోమవారం ఫ్రంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీకి వచ్చింది. విమానాశ్రయంలో అడుగు పెట్టగానే ఆమెను అధికారులు అరెస్టు చేశారు.

పార్వతి మురళిపై 2009లో సుప్రీంకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. అరెస్టు చేసిన తర్వాత పార్వతిని ముంబై పోలీసులకు అప్పగించారు. బాస్ మ్యూజిక్ స్కూల్‌కు సంబంధించిన విషయంపై విచారణ జరుపుతుండగా మహిళలు 2009 మార్చి 20వ తేదీన జస్టిస్ అర్జిత్ పసాయత్‌పైకి పాదరక్షలు విసిరారు. ముగ్గురికి మూడు నెలల జైలు శిక్ష విధించారు. అయితే పార్వతి మురళి దేశం విడిచి పారిపోయింది. సోమవారం అరెస్టు చేసిన పార్వతిని తీహార్ జైలుకు తరలించారు.

English summary
Parvathi Murli, one of the three women who threw footwear at a Supreme Court bench of Justices Arijit Pasayat and A K Ganguly in 2009, was arrested at Delhi airport immediately after she landed from Frunkfurt on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X