రైల్వే బడ్జెట్: ప్రయాణికులపై చార్జీల భారం

సరుకు రవాణా చార్జీలను కూడా పెంచారు. సరుకు రవాణా ఆదాయం 30 శాతం పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. సరుకు రవాణా ఆదాయం 89,339 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. రూ.60,100 కోట్లతో దినేష్ త్రివేది రైల్వే బడ్జెట్‌ను ప్రతిపాదించారు. 12వ పంచవర్ష ప్రణాళికలో బడ్జెట్ రూ. 2.5 లక్షల కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు. 2012లో రైల్వేలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైల్వే శాఖ ఆర్థిక చాలా క్లిష్టమైన పరిస్థితి ఉందని చెబుతూ ఆయన రైల్వే చార్జీల పెంపును ప్రకటించారు. ప్రయాణికుల చార్జీలను మొత్తంగా కిలోమీటరుకు 2 పైసల నుంచి 30 పైసల దాకా పెంచారు. సబర్బన్ రైళ్లలో కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెంచారు.












Click it and Unblock the Notifications