దినేష్ త్రివేది రైల్వే బడ్జెట్: రాష్ట్రానికి వచ్చేవి ఇవే

కాకినాడ - పిఠాపురం ప్రాజెక్టును ప్రభుత్వ భాగస్వామ్యంలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు భూమిని, నిధులను సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు. కొన్ని ప్రాజెక్టులకు తన వంతు వ్యయాన్ని భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు. మెదక్ - అక్కన్నపేట, భద్రాచలం - కోవూరు మధ్య రైల్వే లైన్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి చెందిన పలు రైల్వే లైన్లు ప్రణాళికా సంఘం పరిశీలనలో ఉన్నాయి.
కొండపల్లి - కొత్తగూడెం, మణగూరు - రామగండం, పాండురంగాపురం - భద్రాచలం, పిడుగురాళ్ల - నరసారావుపేట, కదిరి - పుట్టపర్తి, రాయదుర్గం - ఆవులదర్గా మధ్య రైల్వే లైన్ల ప్రతిపాదనలు చేశారు. పరిశీలనలో ఉన్న రైల్వే లైన్లు... కొండపల్లి - కొత్తగూడెం, మణుగూరు - రామగుండం, కదరి - పుట్టపర్తి, శ్రీనివాసపురం - మదనపల్లి, చిక్‌బళ్లాపూర్ - పుట్టపర్తి, జహీరాబాద్ - సికింద్రాబాద్, పాండురంగాపురం - భద్రాచలం, పిడుగురాళ్ల - నర్సారావుపేట ఉన్నాయి.
కొవ్వూరు - భద్రాచలం రైల్వే లైను పూర్తి చేయాలని నిర్ణయించారు. గుణుపూరు - నర్సీపట్నం, మచిలీపట్నం - రేపల్లే వయా నిజాపట్నం సర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు. కాజీపేట - విజయవాడ మూడో రైల్వే లైనుకు అనుమతి ఇచ్చారు. కోరుకొండ - విజయనగరం, తాడిపత్రి - రాయలచెర్వుకు డబ్లింగ్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ - కాకినాడ మధ్య వారానికి మూడు రోజులు ఎపి ఎక్స్‌ప్రెస్, బీదర్ సికింద్రాబాద్ మధ్య వారానికి ఆరు రోజులు ఇంటర్ సిటీని నడపాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ - షాలిమార్ మధ్య కొత్త ఎసి ఎక్స్‌ప్రెస్‌కు అనుమతి లభించింది. ఆంధ్ర ప్రదేశ్ భాగస్వామ్యంలో నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేయనున్నారు. కోటిపల్లి - నర్సాపూర్, కడప - బంగారుపేట, నడికుడి - శ్రీకాళహస్తి, విజయవాడ - మచిలీపట్నంలు పూర్తి చేయనున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications