పార్టీ క్రమశిక్షణకు ఎవరూ అతీతులు కారు: దీదీ

చార్జీల పెంపు విషయంలో దినేష్ త్రివేదీ తనను గానీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ రాయ్‌ని గానీ సంప్రదించలేదని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్ శానససభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జరిగిన పార్టీ శానససభా పక్ష సమావేశంలో ఆమె ఆ విధంగా అన్నారు. రైల్వే చార్జీల పెంపు వల్ల ప్రజలపై భారం పడుతుందని ఆమె అన్నారు. రైల్వే చార్జీల పెంపును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆమె స్పష్టం చేశారు. మమత వైఖరిని పార్టీ సమర్థిస్తూ త్రివేదీని విమర్శించింది.












Click it and Unblock the Notifications