కాంగ్రెసు ప్లాన్: ములాయం ఇన్, మమతా అవుట్?

కాంగ్రెసు సీనియర్ నాయకులు కొంత మంది ములాయం సింగ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎస్పీకి లోకసభలో 22 మంది సభ్యులున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరాలని కాంగ్రెసు నాయకులు ములాయం సింగ్‌ను ఆహ్వానిస్తున్నారు. తృణమూల్, కాంగ్రెసు మధ్య అవిశ్వాసం నెలకొనడం ఇదే మొదటి సారి కాదు. ఇప్పటికే పలు సార్లు మమతా బెనర్జీ కాంగ్రెసుకు హెచ్చరికలు ఇచ్చారు. త్రివేదిని మంత్రి వర్గం నుంచి తొలగించి, ఆ స్థానంలో ముకుల్ రాయ్‌ని నియమించాలని కోరుతూ మమతా బెనర్జీ బుధవారంనాడు లేఖ రాశారు. మమతా బెనర్జీ విజ్ఞప్తిని అంగీకరించినట్లు మొదట సూచనలు ఇచ్చిన కాంగ్రెసు నాయకత్వం ఆ తర్వాత మొత్తం సీన్‌ను మార్చేసింది. త్రివేది రాజీనామా చేయలేదని ప్రభుత్వం ప్రకటించింది. దినేష్ త్రివేదిని తప్పించుకుండా మమతా బెనర్జీకి షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెసు నాయకత్వం ఉన్నట్లు అర్థమవుతోంది. అందుకే మమతా బెనర్జీ కాంగ్రెసుపై మండిపడుతున్నారు.
తమ పార్టీ యుపిఎ నుంచి వైదొలగదని, యుపిఎ చెక్కు చెదరదని తృణమూల్ కాంగ్రెసు పార్టీ నాయకుడు సుదీప్ బంధోపాధ్యాయ చెప్పారున. కానీ, మమతా బెనర్జీ తలనొప్పిని వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెసు నాయకత్వం నాటకాన్ని రక్తి కట్టిస్తోందని అంటున్నారు. యుపిఎకు మద్దతిచ్చే విషయంపై ములాయం సింగ్ చూసుకుంటారని ఉత్తరవ్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు.