వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2012-13 ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ముఖ్యాంశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం 2012-13 బడ్జెట్‌ను లోకసభలో ప్రవేశ పెట్టారు. అంతకుముందు కేంద్ర మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అనంతరం ఆయన సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ప్రణబ్ ఏడోసారి బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు...

- 2012-13 బడ్జెట్ మొత్తం వ్యయం అంచనా రూ.14,19,925 కోట్లు
- 2012-13 ప్రణాళిక వ్యయం రూ.5,21,025 కోట్లు
- ప్రణాళికేతర వ్యయం రూ.9,69,900 కోట్లు
- 2012-13 సంవత్సరానికి ద్రవ్యలోటు అంచనా 1,85,752 కోట్లుగా అంచనా
- పన్ను వసూళ్లలో రూ.32వేల కోట్ల తగ్గుదల
- ద్రవ్య లోటు 5.9 శాతం
- 2011-12 వృద్ధి రేటు 6.9 శాతం
- 2011-12 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు నిరుత్సాహకరంగా ఉంది
- వృద్ధి రేటు తగ్గుదల తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది
- ముడి చమురు ధరలపై ప్రపంచ పరిస్థితుల ప్రభావాన్ని అంగీకరించాలి
- యూరప్ సంక్షోభం, మధ్య ప్రాచ్య రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉంది
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నా భారత్ వేగంగా వృద్ధి చెందుతోంది
- దేశీయ అవసరాలు తీర్చేందుకు ప్రైవేటు భాగస్వామ్యంపై దృష్టి
- వ్యవసాయం, సేవల రంగం మెరుగ్గా ఉన్నాయి
- ఆర్థిక పునరుజ్జీవనానికి ఐదు సూత్రాల ప్రణాళిక
- సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది
- ప్రజా జీవితంలో అవినీతి, నల్ల ధనానికి చోటు లేకుండా చేయాలి
- 2011లో ద్రవ్యోల్భణం సమస్య అధికంగా ఉంది
- తయారీ రంగం పురోగతి వైపు ప్రయాణిస్తోంది
- 2011లో ద్రవ్యోల్భణం సమస్య అధికంగా ఉంది
- ఆహార ద్రవ్యోల్భణ నియంత్రణలో రాష్ట్రాల సహకారం గణనీయం
- ఆసియా దేశాలకు ఎగుమతులు 33.3 శాతం నుండి 55 శాతానికి పెరిగాయి
- ఎగుమతులు, దిగుమతుల మార్కెట్ల విషయంలో విజయం సాధించాం
- వ్యవసాయం, అనుబంధ రంగాలు 2.5 శాతం వృద్ధి సాధించే అవకాశం
- 2012-13లో వృద్ధి శాతం 7.6గా ఉంటుందని అంచనా
- సబ్సిడీలను జిడిపిలో 2 శాతం నుండి 1.7 శాతం తగ్గిస్తాం
- పారిశ్రామిక వృద్ధి తగ్గడం వల్ల ఆర్థిక వృద్ధి మందగించింది
- ముడి చమురు కొనుగళ్లకు గణనీయంగా నిధులు వ్యయం
- ఆరు నెలల్లో కిరోసిన్, ఎల్‌పిజి సబ్సిడీ నేరుగా లబ్ధిదారులకు అందించే విధంగా పైలట్
- లబ్ధిదారులకు నేరుగా సబ్సిడీలు అందించే ప్రక్రియ వేగవంతం
- నందన్ నీలేకని కమిటీ సిఫార్సులను పరిగణిస్తున్నాం
- నిరుత్సాహకంగా పారిశ్రామిక ప్రగతి, జిడిపి 27 శాతం దిశగా
- రానున్న రోజుల్లో ద్రవ్యోల్భణం దిగొచ్చే అవకాశం
- ఎగుమతులకు కొత్త మార్కెట్ల అన్వేషణ ఫలించడం సంక్షోభం నుండి కాపాడింది
- తొలి త్రైమాసికంలో 23 శాతం పెరిగిన ఎగుమతులు
- ఎరువుల సబ్సిడీల రాయితీలు చెల్లించేందుకు కంప్యూటరీకరణ
- గ్యాస్ పైలట్ ప్రాజెక్టు మైసూరులో నడుస్తోంది
- ముడి చమురు ధర భారీగా పెరగడం ప్రభావం చూపింది
- రానున్న రెండేళ్లలో ఆహార భద్రత బిల్లు పూర్తిస్థాయిలో అమలు
- బడ్జెట్‌లో భాగంగానే ఎప్ఆర్‌బిఎం చట్ట సవరణలు
- త్వరలో ప్రత్యక్ష పన్నుల కోడ్ బిల్లు
- ఇక నుంచి ఐపివో ప్రక్రియ సరళతరం
- పది కోట్లు పైబడిన ఐపివోల విడుదల ఇకపై ఎలక్ట్రానిక్ ఫార్మట్ తప్పనిసరి
- రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి
- నాబార్డ్, ఇతర వ్యవసాయ బ్యాంకులకు రూ.15,888 కోట్లు
- ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో నెఫ్ట్ పద్ధతి విజయవంతం
- పబ్లిక్ బ్యాంకుల మూల ధన అవసరాలకు ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు పరిశీలన
- 12వ ప్రణాలికలో పారిశ్రామిక మౌలిక వసతుల కోసం రూ.50 లక్షల కోట్లు
- ప్రభుత్వ రంగ సంస్థల్లో 51 శాతం వాటా కొనసాగింపు
- గ్రామాల్లో బ్యాంక్ కరస్పాండెట్ల వ్యవస్థ ఏర్పాటు
- జాతీయ రహదారుల సంస్థకు బాండ్ల ద్వారా 10వేల కోట్లు సమకూరుస్తాం
- మల్టీ బ్రాండ్ రీటెయిలింగ్‌లో 51శాతం ఎఫ్‌డిఐలకై ఏకాభిప్రాయం
- ఈ సమావేశాల్లోనే మైక్రో ఫైనాన్స్ సంస్థల నియంత్రణ బిల్లు
- ఈ సమావేశాల్లోనే జాతీయ హౌసింగ్ బ్యాంక్ నియంత్రణ బిల్లు
- ఈ సమావేశాల్లోనే ప్రజా రుణాల నిర్వహణ బిల్లు
- కొత్తగా రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీం, రూ.50వేలు ఆదాయ పన్ను రాయితీ
- రక్షణ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు
- వెయ్యి జనాభా ఉన్న పల్లెలకు కూడా స్వాభిమాన్ పథకం
- విమానయాన రంగంలోకి విదేశి పెట్టుబడులపై పరిశీలన
- ఢిల్లీ - ముంబయి కారిడార్ నిర్మాణానికి నిధులు
- గుంటూరు, ప్రకాశం జిల్లాలో చేనేత సముదాయాలు ఏర్పాటు చేస్తాం
- జాతీయ రహదారుల అభివృద్ధి పథకంలో 8,800కి.మీ. జాతీయ రహదారులు
- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో మౌలిక రంగంలో పెట్టుబడుల సమీకరణ
- ఆగస్టు 12 నుంచి జిఎస్‌టి అమలు
- వచ్చే ఐదేళ్లలో యూరియా ఉత్పత్తిలో స్వావలంభన
- రైతులకు స్వల్పకాలిక రుణాలకై నాబార్డ్ ద్వారా రూ.10వేల కోట్లు
- నీటి పారుదల రంగానికి అన్ని రకాల కేటాయింపులు పెంపు
- వ్యవసాయ రుణ పరపతికి రూ.5వేల 75వేల కోట్లు
- వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంపు
- రైతులకు వడ్డీ రాయితీలు కొనసాగింపు
- కిసాన్ క్రెడిట్ కార్డు పథకం సవరణ
- కిసాన్ కార్డును ఎటిఎం కార్డులా వినియోగించే స్మార్ట్ కార్డులా మార్పు
- ఏఐడిపి కార్యక్రమానికి రూ.14వేల కోట్లు
- ఆధార్ వేదికగా ఆహార భద్రతకు పటిష్ట ఏర్పాట్లు
- మధ్యాహ్న భోజనానికి రూ.11,930 కోట్లు
- తాగునీరు, పారిశుద్ధ్యంకు రూ.14వేల కోట్లు
- ప్రధానమంత్రి సడక్ యోజనకు రూ.24వేల కోట్లు
- చేనేత రుణ మాఫీ రూ.3,884 కోట్లు
- చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.5వేల కోట్లు
- సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు అదనంగా 3 శాతం రాయితీ
- సర్వ శిక్షా అభియాన్‌కు రూ.25,555 కోట్లు
- జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌కు రూ.20,822 కోట్లు
- వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.12,040 కోట్లు
- నీటి పారుదల రంగం బలోపేతానికి రూ.300 కోట్లు
- గతేడాదితో పోలిస్తే పోలీటే కేసు దేశం మొత్తం మీద ఒక్కటి నమోదు కాలేదు
- యువతకు ఉద్యోగ అవకాశాల కోసం రూ.1276 కోట్లతో ప్రధాని ఉపాధి హామీ
- గ్రామీణ మహిళలకు 7శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు రుణాలు
- బలహీన వర్గాలకు రూ.8,400 కోట్లు
- ఆహార శుద్ధి రంగానికి ఈ ఏడాది జాతీయ మిషన్
- ప్రతిభ ప్రాతిపదికన ఆశా వర్కర్లకు వేతనాలు పెంపు
- వితంతు పించన్లు రూ.200 నుంచి రూ.300కు పెంపు
- కుటుంబ లబ్ధి పథకం కింద రూ.10వేల నుండి రూ.20వేలకు పెంపు
- ఆనంద్ రూరల్ మేనేజ్ మెంట్ సంస్థకు 25వేల కోట్లు
- కేరళ వ్యవసాయ విద్యాలయానికి రూ.100 కోట్లు
- వ్యవసాయ రుణ లక్ష్యం రూ.5.75 లక్షల కోట్లు
- నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు రూ.1000 కోట్లు
- రక్షణ సర్వీసులకు రూ.1,93, 407 కోట్లు
- హైదరాబాద్ ఎన్‌జి రంగా వ్యవసాయ వర్సిటీకి రూ.వంద కోట్ల నిధి
- సకాలంలో రుణాలు చెల్లించే మహిళా సంఘాలకు 4శాతం వడ్డీ
- నల్లధనంపై శ్వేత పత్రం ఈ సమావేశాల్లో ప్రవేశపెడ్తాం
- ఆదాయ పన్ను పరిమితి రూ.2 లక్షలు
- రూ.2 లక్షల నండి రూ.5 లక్షల వరకు పది శాతం పన్ను
- రూ.5 లక్షల నుండి రూ.పది లక్షల వరకు 20 శాతం పన్ను
- ఎస్‌బి ఖాతాలో రూ.10వేల ఖాతాపై పన్ను మినహాయింపు
- రూ.10 లక్షలకు పైగా ఉంటే 30 శాతం పన్ను
- మహిళలకు, వృద్ధులకు గరిష్ఠ మినహాయింపు పరిమితి రూ.2 లక్షలే
- ప్రత్యక్ష పన్నుల్లో గతేడాది రూ.4వేల కోట్ల లోటు
- జిడిపిలో 45 శాతంగా కేంద్ర రుణభారం
- పరిశ్రమలకు పన్ను మినహాయింపు కోసం టర్నోవర్ రూ.కోటికి పెంపు
- కార్పోరేట్ పన్నుల్లో ఎలాంటి మార్పులు లేవు
- సినీ రంగానికి సేవా పన్ను మినహాయింపు
- రూ.2లక్షల బంగారం కొనుగోళ్లపై తక్షణ డిటిఎస్
- సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్‌లకు కామన్ కోడ్ ప్రతిపాదన
- సేవా పన్ను పరిమితుల్లో నుండి విద్యా, వినోదం, ప్రభుత్వ సేవలు, ప్రజా రవాణాలకు మినహాయింపు
- సేవా పన్నుల నుండి 17 రంగాలకు మినహాయింపు
- లగ్జరీ కార్ల దిగుమతిపై పన్ను 22 శాతం నుండి 24 శాతానికి పెంపు
- పెద్ద కార్లపై 27 శాతం విలువ ఆధారిత పన్ను, సుంకం యథాతథం
- వ్యవసాయేతర వస్తువుల దిగుమతులపై కస్టమ్స్ సుంకంలో మార్పు లేదు
- విమానాల ఆధునికీకరణకై విడి భాగాలపై దిగుమతి సుంకం మినహాయింపు
- సాధారణ ఎక్సైజ్ సుంకం 10 శాతం నుండి 12 శాతానికి పెంపు
- సౌరవిద్యుత్ పరికరాల దిగుమతిపై కౌంటర్ వీలింగ్ సుంకం రద్దు
- ప్లాటినం దిగుమతిపై సుంకం 10 శాతం పెంపు
- బంగారం దిగుమతిపై సుంకం 5 శాతం పెంపు
- బ్రాండెడ్ వెండి ఆభరణాలపై ఎక్సైజ్ సుంకం మినహాయింపు
- రహదారి నిర్మాణ విడి భాగాల యంత్రాల దిగుమతులపై పూర్తి సుంకం మినహాయింపు
- సైకిళ్లపై 30 శాతం కస్టమ్స్ పెంపు
- ఎల్‌సిడి, ఎల్‌ఈడి దిగుమతి సుంకం తగ్గింపు, ధరలు తగ్గే అవకాశం
- మూడేళ్లపాటు ఎరువుల పరిశ్రమ ఉత్పాదక సామాగ్రి దిగుమతి సుంకం మినహాయింపు
- థర్మల్ విద్యుత్ సంస్థలకు రెండేళ్ల పాటు ఎక్సైజ్ సుంకం మినహాయింపు
- సహజవాయువు, ఎల్ఎన్‌జి, విద్యుదుత్పత్తికి ఉపయోగించే యూరేనియంకు రెండేళ్ల పాటు సుంకం మినహాయింపు

English summary
Union Budget 2012-13 - Live updates
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X