రాజీనామాకు త్రివేది కొత్త కొలికి: రాతలో ఇవ్వాల్సిందే

పార్టీ నిర్ణయాన్ని మమతా బెనర్జీ తనకు రాతపూర్వకంగా తెలియజేయాలని త్రివేది అన్నట్లు బెనర్జీ చెప్పారు. రాతపూర్వకంగా రాజీనామా చేయాలని సూచించాలని త్రివేది అడగడం సరైంది కాదని ఆయన అన్నారు. మంత్రి పదవి తీసుకునేప్పుడు రాతపూర్వకంగా ఇవ్వాలని త్రివేది అడగలేదని ఆయన అన్నారు. మంత్రి పదవి తీసుకోవాలని పార్టీ సూచించినందున త్రివేదికి మంత్రి పదవి దక్కిందని, పార్టీ దిగిపోవాలని సూచించినప్పుడు గౌరవంగా తప్పుకోవాలని బెనర్జీ అన్నారు.
రైల్వే బడ్జెట్‌ను ప్రతిపాదించిన వెంటనే త్రివేదిని మంత్రి పదవి నుంచి తప్పించాలని మమతా బెనర్జీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కోరారు. అయితే, మమతా బెనర్డీతో ప్రదానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడి కొంత సమయం కావాలని అడిగినట్లు తెలుస్తోంది. ఈ నెల17వ తేదీ తర్వాత త్రివేది మంత్రి పదవిపై ప్రధాని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications