కొవూరు 'జగన్'దే, టిఆర్ఎస్‌దే గెలుపు:లగడపాటి జోస్యం

మహబూబ్‌నగర్‌లో టిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. రాజీనామా చేసిన అభ్యర్థులదే గెలుపు అని చెప్పారు. కాంగ్రెసు, టిడిపిలు రెండు స్థానాల్లో రెండో స్థానంలో ఉంటాయని, మిగిలిన మూడు స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లు ఉంటాయని చెప్పారు. అభ్యర్థులను ముందే ప్రకటిస్తే త్వరలో జరగనున్న 17 నియోజకవర్గాల్లోని ఉప ఎన్నికల్లో కాంగ్రెసు మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. అభ్యర్థుల విషయంలో గందరగోళం కూడదన్నారు. ముందే ప్రకటించాలని చెప్పారు. ప్రభుత్వంపై కనిపించిన ఆదరణ ఓటింగులో లేదన్నారు. ఓటింగ్ సరళిలో గణనీయ మార్పులు జరిగాయన్నారు. విపక్షాల ఆరోపణలు తిప్పి కొట్టడంలో తమ పార్టీ నేతలు విఫలమయ్యారన్నారు. జగన్ ఆరోపణలు తిప్పి కొట్టడంలో విఫలం కావడం, తెలంగాణ సెంటిమెంట్ కారణంగా తాము రెండు, మూడో స్థానాలకు పరిమితమవుతున్నామని చెప్పారు.
జగన్, టిఆర్ఎస్ ఉప ఎన్నికల విషయంలో స్పష్టతతో ఉండగా, కాంగ్రెసు, టిడిపిలకు స్పష్టత లేకుండా పోవడం నష్టం కలిగించిందన్నారు. అయితే ఈ విషయంలో టిడిపి మాకంటే కొద్దిగా ముందు మేల్కొందని చెప్పారు. టిడిపి నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు ఫైటింగ్ ఆ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పారు. కాంగ్రెసు ఇప్పుడు బాగా కష్టపడిందని అన్నారు. ఇదే రకంగా వచ్చే ఉప ఎన్నికల్లో కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తామని అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం ఈ అంశంపై ఇప్పటికే చెప్పాల్సింది చెప్పిందని అన్నారు. జగన్ ఆరోపణలు తిప్పి కొట్టడంలో మాది మెతక వైఖరి అన్నారు.












Click it and Unblock the Notifications